Sunday, December 22, 2024

ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల కోసం ఎబివిపి ఆందోళన

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎబివిపి జిల్లా కన్వీనర్ ఆర్. ఆకాష్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ముందు ఎబివిపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 5300 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్‌ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న ప్రయివేట్ కాలేజీలు, స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు చంద్రశేఖర్, పూజ, ప్రసాద్, పవన్‌రెడ్డి, రాజు, వంశీ, విద్యార్థులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News