Sunday, December 22, 2024

ఇంటర్‌బోర్డు ముందు ఎబివిపి ధర్నా

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమంగా ఫీజుల దోపిడీ, సర్కార్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలంటూ ఎబివిపి విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ప్రైవేట్ కళాశాలలో అక్రమ తరగతుల నిర్వహణను నియంత్రించాలంటూ బుధవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్ ముందు ముట్టడికి యత్నించారు. వందల సంఖ్యలో విద్యార్థులు నాలుగువైపులా ఆందోళనకారులు బోర్డు ఆఫీస్‌కు తరలొచ్చారు. బోర్డు ఆఫీస్‌లోకి చొరబడేందుకు నిరసనకారుల యత్నించగా వెంటనే తెరుకున్న పోలీసులు అడ్డుకున్నారు.

విద్యార్థులకు న్యాయం జరగాలి, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఆరికట్టాలి, వేసవిలో అక్రమ తరగతుల నిర్వహణ అడ్డుకోవాలి, స ర్కార్ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి, కెసిఆర్ పాలన నశించాలంటూ నినాదాలు హోరెత్తాయి. పలువురు విద్యార్థులు ఆఫీస్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించగా వారి మద్య తోపులాటలు, వాగ్వివాదాలతో ఈ ప్రాంతం గందరగోళంగా మారింది.

కెసిఆర్ పాలన వద్దురా అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుమీదనే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసుల వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఎబివిపి నాయకులు ఝాన్సీ, సురేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సుమారు యాభై మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News