Monday, December 23, 2024

వాట్సాప్ లో అమ్మాయిలతో అశ్లీల వీడియోలు… ఎబివిపి లీడర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అశ్లీల వీడియోలు, అమ్మాయిలు తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలను ఎబివిపి లీడర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం శివమొగ్గలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తీర్థహళ్లి ప్రాంతంలో ప్రతీక్ గౌడ అనే యువకుడు ఎబివిపి ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నాడు. అమ్మాయిలతో మాట్లాడిన వీడియో కాల్స్‌ను రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసేవాడు. ప్రతీక్‌తో అమ్మాయిలు ఏకాంతంగా గడిపిన వీడియోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు ఈ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ప్రతీక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రతీక్ అమ్మాయి వీడియో కాల్స్ రికార్డు చేసి వేధించేవాడని దర్యాప్తు తేలింది. ఈ వీడియోలను ఎవరైన షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Also Read: పచ్చని యజ్ఞానికి పదేండ్లు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News