Wednesday, January 22, 2025

శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్ పై దాడి.. ఫర్నీచర్ ధ్వంసం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఘట్ కేసర్ యంనంపేటలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్ పై ఎబివిపి నాయకులు దాడి చేశారు. సోమవారం కాలేజ్ పై ఎబివిపి నాయకులు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన కాలేజ్ సెక్యూరిటీ సిబ్బందిని కొట్టినట్లు తెలుస్తోంది. గత నెల 31న ఇద్దరు విద్యార్థుల హాజరు విషయంపై మాట్లాడేందుకు శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్ కు వెళ్లిన ఎబివిపి నాయకులపై సెక్యూరిటి సిబ్బంది దాడి చేశారు.

దాడికి నిరసనగా ఎబివిపి నాయకులు ప్రతిదాడి చేసినట్లు సమాచారం. కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఎబివిపి నాయకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News