Saturday, January 18, 2025

విద్యార్థిని మృతికి నిరసనగా.. బాసరలో ఏబీవీపీ ఆందోళన

- Advertisement -
- Advertisement -

నిర్మల్: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని మృతికి ఏబీవీపీ నిరసనగా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో బాసర ఆర్టీయూకేటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

బాసరలో రైల్వేస్టేషన్‌, అమ్మవారి ఆలయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఎక్కడికక్కడే ఏబీవీపీ యువకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బాసర అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులనూ అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.  మీడియా ప్రతినిధులపైనా ఆంక్షలు విధించిన పోలీసులు.. విలేకరుల సెల్‌ఫోన్లు తీసుకుని వీడియోలు డిలీట్‌ చేస్తుండటంతో.. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News