Thursday, January 23, 2025

గద్వాల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడి

- Advertisement -
- Advertisement -

 జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడి
 బుక్ స్టాల్స్‌గా మారిన ప్రైవేట్ స్కూల్స్
 ప్రైవేట్ బడుల్లో.. పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ దందా
 విద్యాహక్కు చట్టాన్ని కాపాడుకుందాం
 విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్  టై, బెల్టు యూనిఫామ్సా, స్టేషనరీ విక్రయాలు
మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: తమ పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్ విద్యాభోదన అందించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అయితే వీరి ఆశను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు, యజమానులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, స్టేషనరీని అధిక ధరలకు విక్రయిస్తూ తమ పాఠశాలల్లోనే విద్యనందించాలనే విధంగా చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇంత జరుగుతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దోపిడికి పాల్పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలకు తాళం చేయాలని కోరుతున్నారు. విద్యాసంస్థలు పాఠశాలల ప్రభుత్వ నియమ నిబంధనలు కాకుండా అడ్డగోలుగా దోపిడి చేస్తున్నాయి. విద్యార్థులకు పుస్తకాలు ఉన్న ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తుండటంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. పుస్తకాలు షాపులలో దొరుకుతున్న తమ వద్ద కొనుగోలు చేయాలనే నిబంధన పెడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్ ప్రైవేట్ పాఠశాలల్లో యామాన్యాలకు మరో ఆలోచన లేదని తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు.

అలంపూర్, గర్వాల రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి, పెద్ద ఎత్తున ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ప్రైవేట్ పాఠశాల అధిక రుసుముకు పుస్తకాలు అమ్ముతున్నారంటూ విద్యార్థి నాయకులు ఆందోళన… జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ చైతన్య పాఠశాలలో అక్రమంగా నిల్వ ఉంచి పుస్తకాలు అమ్మకాలు చేపడుతున్న చైతన్య పాఠశాల లైషన్స్ రద్దు చేయాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఆందోళన, జిల్లా విద్యశాఖ అధికారి సంఘటన స్థలానికి రాక పోవడంతో మండలాధికారి కారుకు అడ్డుగా కూర్చొని విద్యార్థి నాయకులు నిరసన చేశారు. వారి తల్లిదండ్రులకు చెప్పి పాఠశాలకు కావాల్సిన పుస్తకాలు, సామాగ్రి, ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా విద్యాధికారి మహ్మద్ సిరాజుద్దిన్ మన తెలంగాణ ప్రతినిధితో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News