Tuesday, January 21, 2025

కవులపై ఎబివిపి కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో సదస్సుకు హాజరైన కవులు, రచయితలపై ఎబివిపి కార్యకర్తులు దాడి చేశారు. మీటింగ్ జరుగుతుండగా అనుమతి ఎవరిచ్చారంటూ, పర్మిషన్ లెటర్ చూపించాలని నిర్వాహకులతో ఎబివిపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు ఎబివిపి లీడర్లను హాల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి రచయితలు, కవులు బయటకు వస్తుండగా అప్పటికే గుంపుగా ఉన్న ఎబివిపి లీడర్లు వారిపై దాడికి దిగారు. ఎబివిపి కార్యకర్తల దాడిలో పలువురు కవులు, రచయితలు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News