Sunday, December 22, 2024

జిహెచ్‌ఎంసి పరిధిలో ఏసీ బస్సు పాస్ ఛార్జీల తగ్గింపు

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసీ పరిధిలో ఏసి బస్ చార్జీలను టిజిఎస్‌ఆర్టీసీ తగ్గించింది. ఈ మేరకు టిజిఎస్‌ఆర్టీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర రూ.2,530 రూపాయలు ఉండగా, ప్రయాణికుల కోసం రూ.630 తగ్గించి రూ.1900కే బస్ పాస్‌ను అందిస్తోంది. సికింద్రాబాద్ – పటాన్ చెరువు (219 రూట్), బాచుపల్లి – వేవ్ రాక్ (195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఈ బస్‌పాస్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు -మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించింది.

ఎయిర్పోర్ట్ మార్గంలో నడిచే పుష్ఫక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లను జారీ చేయనున్నట్లు టిజిఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News