Thursday, January 23, 2025

ఇకపై ఏసీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డ్రైవర్ల సౌకర్యార్థం ట్రక్కుల్లో, లారీల్లో డ్రైవర్ క్యాబిన్‌లలో వినూత్నమైన మార్పులు చేయాలని ఆటో మొబైల్ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. 2025 నుంచి తయారు చేసే ట్రక్కులు, లారీల్లోని డ్రైవర్ క్యాబిన్‌లలో ఎసి అందుబాటులో ఉండేలా రూపొందించాలని కంపెనీలకు సూచించారు.

దీనికోసం 18నెలల సమయం ఇస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాహనాల్లో కూడా ఎసి క్యాబిన్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే విదేశాల్లోని లారీల్లో ఎసి తో కూడిన క్యాబిన్ లు ఉన్నాయని తెలిపారు. మనదేశంలో మాత్రం ఇప్పటి వరకు అటువంటి వెసులుబాటు లేదని, ఇకపై లారీల్లోని క్యాబిన్ లలో ఎసిలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో డ్రైవర్లు సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేయలేరని, కాబట్టి క్యాబిన్ లలో ఎసిలు ఏర్పాటు చేసుకున్నట్లైతే వారు సౌకర్యవంతంగా వాహనాలను నడుపుతారని వెల్లడించారు. దీని కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని రూ. 10వేల నుంచి రూ. 20వేల వరకు వెచ్చించి డ్రైవర్ క్యాబిన్ లలో ఎసిలు అమర్చుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో డ్రైవర్లకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News