బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ లో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. జైస్వాల్ తప్ప మిగతా వారు విఫలం కావడంతో తీవ్ర కష్టాల్లో పడిన భారత్ ను వాషింగ్టన్ సుందర్ తో కలిసి విశాఖ కుర్రాడు నితీశ్ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి జట్టుకు సెంచరీ భాగస్వామ్యం అందించారు.
ఈ క్రమంలో సుందర్ అర్ధశతకం సాధించిగా.. నితిశ్ కుమార్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ మూడో రోజు ఆట ముగిసేసమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగలతో పటిష్ట స్థితిలో నిలిచింది.దీంతో సోషల్ మీడియాపై వేదికగా నితిశ్ కుమార్ పై మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అకాడమీ.. జట్టు ఆపదలో ఉన్న సమయంలో శతకంతో చెలరేగి ఆదుకున్న నితీశ్ ను అభినందిస్తూ రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. ఇక, ఎపి సిఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు కూడా నితీశ్ ను అభినందించారు.