Saturday, January 11, 2025

విల్ స్మిత్ రాజీనామాకు అకాడమీ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Academy approves Will Smith's resignation

న్యూఢిల్లీ: హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ రాజీనామాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్ శనివారం ఆమోదించింది. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ విల్ స్మిత్ శుక్రవారం లేఖ రాయగా స్మిత్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ బహిరంగ ప్రకటన చేశారు. అకాడమీ నియమ నిబంధనలను, ప్రమాణాలను అతిక్రమించిన విల్ స్మిత్‌పై క్రమశిక్షణా చర్యల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. అకాడమీ తదుపరి సమావేశం ఏప్రిల్ 18న జరుగుతుందని, ఈ సమావేశంలో విల్ స్మిత్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన 94వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో విల్ స్మిత్ కార్యక్రమాన్ని యాంకరింగ్ చేస్తున్న క్రిస్ రాక్‌పై చేయిచేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News