- Advertisement -
పింఛన్ బెనిపిట్స్ వచ్చేందుకు లంచం డిమాండ్ చేసి సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్‌ను డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విక్రం అలెగ్జాండర్ హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. సివిల్ సప్లయ్స్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసి ఉద్యోగి పింఛన్ ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ.15,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచనల మేరకు సెక్షన్ ఆఫీసర్ విక్రంకు రూ.15,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
- Advertisement -