Wednesday, January 8, 2025

హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెచ్‌ఎండిఎ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఎసిబి అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. రూ.100 కోట్ల ఆస్తులు, బినామిలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

18 ప్రాంతాల్లో సోదాలు చేసి 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించినట్లు రిపోర్టులో చెప్పారు. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం రూ.5 కోట్ల వరకు ఉంటుందని.. బహిరంగ మార్కెట్ లో 10 రెట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. సోదాల్లో రూ.99 లక్షల నగదు, 4 కార్ల విలువ రూ.51 లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.58 లక్షలు.. గోల్డ్, సిల్వర్, వాచ్ లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం వాల్యూ రూ.8.26 కోట్లు, నాలుగు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో వివరించారు.

అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో గత బుధవారం హెచ్‌ఎండిఎ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎసిబి అధికారులు దాడులు చేశారు. ఎసిబి సోదాల్లో రూ.100 కోట్లకుపైగా స్థిర, చరాస్థులను గుర్తించిన ఎసిబి అధికారులు.. బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News