Wednesday, January 22, 2025

మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడిని అరెస్టు చేసిన ఎసిబి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి నేత జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రాజీవ్ అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు రావడంతో అతడితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కామ్‌లో ఎసిబి అధికారులు ఐపిసి 420, 409, 467, 471, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ స్కామ్‌లో ఎ1 రాజీవ్, ఎ2 జోగి రమేశ్ బాబాయ్ వెంకటేశ్వర్ రావు, ఎ3 అడుసుమిల్లి మోహనరంగదాసు, ఎ4 వెంకట సీతామలక్ష్మి, ఎ5 సర్వేయర్ దేదీప్య, ఎ6 మండల సర్వేయర్ రమేశ్, ఎ7 డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎ8 విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, ఎ9 విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వర్ రావు అని ఎసిబి అధికారులు తెలిపారు. జోగి రమేశ్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టన అనంతరం రాజీవ్‌ను అదుపులోకి తీసుకొని గొల్లపూడి కార్యాలయానికి తరలించారు.

ప్రభుత్వంలో ఉన్న టిడిపికి తనపై కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని తన కుమారుడిపై ఎసిబితో కేసులు నమోదు చేయించడం సరికాదని జోగి రమేశ్ తెలిపారు. రాజీవ్ అమెరికాలో చదువుకొని ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడని తెలిపారు. ప్రభుత్వాలు వస్తూంటాయి పోతుంటాయని, అధికారంలో ఉన్నమని ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News