Sunday, November 24, 2024

ఎసిబికి పట్టుబడిన సంగారెడ్డి డిఇఒ,సీనియర్ అసిస్టెంట్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి బ్యూరో: ఎసిబి వలలో సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణగౌడ్ పట్టుబడ్డారు. శుక్రవారం సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఎసిబి దాడులు చేసి రూ. 50వేల లంచం తీసుకుంటుంగా ఎసిబి అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా వల పన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ రేంజ్ ఎసిబి డిఎస్‌పి ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ రామచంద్రాపురానికి చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాల సిబిఎస్‌ఇ నుంచి ఐసిఎస్‌సి సిలబస్ అప్‌గ్రేడ్ కోసం జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించగా లక్ష 10వేల రూపాయలు డిమాండ్ చేయగా ఒకేసారి అంత ఇవ్వలేమని రెండు విడతలుగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని మొదటి విడతగా రూ. 50వేలు ఇచ్చేందుకు అంగీకరించి రెండో విడత మరో రూ. 60వేలు ఇచ్చేందుకు నిర్ణయించుకోగా

అన్ని అనుమతులు ఉన్న తమను డిఇఒ, సీనియర్ అసిస్టెంట్ వేధిస్తుండడంతో లంచం ఇవ్వడం స్కూల్ యాజమాన్యం ఈ నెల15న ఎసిబిని ఆశ్రయించారని ఆయన తెలిపారు. శుక్రవారం మొదటి విడతగా 50 వేల రూపాయలను డిఇఒ ఆదేశాలతో సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణగౌడ్ తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విస్త్రృతంగా సోదాలు జరిపి డిఇఒపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని ఎసిబి డిఎస్‌పి తెలిపారు. దాడుల వివరాలను తెలుసుకున్న ఆర్‌జెడి విజయలక్ష్మి సంగారెడ్డి డిఇఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ దాడులలో ఎసిబి అధికారులు రమేష్, నగేష్, వెంకట్‌రాజుగౌడ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News