Friday, January 17, 2025

ఎసిబి వలలో వాటర్ బోర్డు ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నల్లా నీటి కోసం డబ్బులు డిమాండ్ చేసిన హెచ్‌ఎండబ్లూఎస్‌ఎస్‌బి అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బోడి శ్రీనివాస్ హైదరాబాద్ వాటర్ వర్క్ ఎల్లారెడ్డి గూడలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బాధితుడు సింగు రమేష్ టైలర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంట్లో ఉన్న నల్లా నీరు తక్కువగా వస్తోందని ఫిర్యాదు చేశాడు.

దానిని సరి చేయాలంటే రూ.40,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు శ్రీనివాస్‌కు బాధితుడు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసి ఎసిబి జడ్జి ఎదుట హాజరు పర్చగా కోర్టు రిమాండ్ విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News