Monday, January 20, 2025

ఖాకీల లంచావతరం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిఐ వీరస్వామి, ఎస్‌ఐ షఫీని ఎసిబి అధికా రులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, ఎస్‌ఐ షపి, మధ్యవర్తి ఉపేందర్‌లను ఎసిబి అధికారులు అదుపులోకి తీసు కున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఎసిబి డిఎస్‌పి ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కుషాయి గూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమికి సంబంధించి మరో వ్యక్తి భూ సమస్యపై గొడవలో భాగంగా రెవెన్యూ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులపై భరత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు.

అయితే ఇందులో ఓ కేసుకు సంబంధించి భరత్ రెడ్డిపై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా సిఐ వీర స్వామి, ఎస్‌ఐ షఫిలు మూడు లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. అన్ని మాట్లాడుకున్న తర్వాత భరత్ రెడ్డి ఆఫీసులో మధ్యవర్తి ఉపేందర్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో సిఐ వీరాస్వామి, ఎస్‌ఐ షపి, మధ్యవర్తి ఉపేందర్‌లను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించామని ఎసిబి డిఎస్‌పి ఆనంద్ కుమార్ తెలిపారు. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపైనా ఎసిబి అధికా రులు దృష్టి సారించారు. అటు గుర్రంగూడ సమీపంలోని ఇన్‌స్పెక్టర్ వీరాస్వామి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ వెల్లడిం చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News