Sunday, December 22, 2024

రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన ఇరిగేషన్ ఎఈ

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వ హయాంలోని అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఎఈ ఎసిబికి పట్టుబడ్డాడు. సోమవారం హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్‌బిఐ ప్రాంతంలో రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఎఈ గుగులోతు గోపాల్‌ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. పాలకుర్తి మండలం, గుడికుంట తండా మాజీ ఎంపిటిసి బానోతు యాకు గతంలో చేసిన పనుల కోసం ఇరిగేషన్ ఎఈ గోపాల్ రూ.పది వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎఈ గోపాల్ ప్రస్తుతం గుడికుంట తండా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News