Wednesday, January 1, 2025

ఎసిబికి చిక్కిన పంచాయతీరాజ్ ఎఇ

- Advertisement -
- Advertisement -

వరంగల్ జిల్లాలో ఎసిబి వలలో పంచాయతీరాజ్ ఎఒ చిక్కాడు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కార్తీక్ రూ.5 వేల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, కడారిగూడెం మాజీ సర్పంచ్ సతీష్ కాంట్రాక్ట్ బిల్లుల కోసం గత కొంతకాలంగా ఎఇ చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లుల ఫైల్ క్లియరెన్స్ చేయకపోగా రూ.5 వేలు డబ్బులు ఇవ్వాలని ఎఇ డిమాండ్ చేశాడు. దీనితో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జడ్‌పి కార్యాలయానికి సమీపంలోని హరిత కాకతీయ హోటల్‌లో గురువారం ఎఇకి రూ.5 వేలు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం జడ్‌పి కార్యాలయంలో ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News