Friday, November 22, 2024

సబ్ రిజిస్టార్ తస్లీమా నివాసాలపై ఎసిబి దాడులు

- Advertisement -
- Advertisement -

గత నెలలో లంచం తీసుకుంటు ఎసిబికి పట్టుబడ్డ మహాబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ నివాసంలో సోమవారం ఎసిబి సోదాలు జరిపింది. ఈ మేరకు హన్మకొండలోని ఆమె నివాసంతో పాటు సూర్యాపేటలో నివాసం ఉంటున్న ఆమె భర్త, బందు వుల ఇళ్లలోను తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆమె కూడబెట్టిన రూ.3 కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులు బయట పడ్డట్లుగా వెల్లడించారు. తస్లీమాకు చెందిన పలు చోట్ల ఉన్న 5 ఇళ్లుల విలువ 2 కోట్లకు పైగా ఉంటుందని,

అలాగే 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఎకరాల వ్యవసాయ భూమి, కార్లు ఇతర వస్తువుల విలువ దాదాపు కోటి వరకు ఉన్నాయని వెల్లడించింది. ఈ కేసుపై మరింత విచారణ జరుపుతామన్నారు. కాగా మహాబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న తస్లీమా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి వద్ద ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అదే ఆఫీస్‌లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ సహాయంతో రూ.19,200 లంచంగా తీసుకుంటు ఎసిబికి చిక్కారు. ప్రస్తుతం ఆమె జైళ్లోనే ఉన్నారు. ఆమెపై పలు ఫిర్యాదులు రావడంతో తస్లీమా ఇళ్లలో సోదాలు జరిపినట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News