Sunday, December 22, 2024

శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన ఎసిబి కోర్టు

- Advertisement -
- Advertisement -

అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. శివబాలకృష్ణకు ఎసిబి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీ కత్తుతో బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఎసిబి కోర్టు ఆదేశించింది. ఇక అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణతో పాటు కుటుంబసభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 8 ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు దర్యాప్తులో బహిర్గతమైంది. ఈ మేరకు రెరా కార్యదర్శిగా పనిచేసినప్పుడు భారీగా సంపాదించిన ఆయన ఇప్పటి వరకు బయటపడిన ఆస్తుల విలువ రూ.250 కోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తులను భార్య, కూతురు, అల్లుడు, సోదరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు.

శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ పేరిట కూడా 70 శాతం ఆస్తులలున్నాయని, తెలంగాణతో పాటు ఎపిలో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు చెప్పారు. అత్యధికంగా జనగాం లోనే ఆస్తులు ఒకేచోట 102 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా..యాదాద్రి భువనగిరిలో 66 ఎకరాలు, నాగర్ కర్నూల్ లో 38 ఎకరాలున్నట్లు పేర్కొన్నారు. ఇక రంగారెడ్డిలో 12, మెదక్ లో 2, మేడ్చల్ లో 2, సంగారెడ్డిలో 3 ప్లాట్లు, సిద్ధిపేటలో 7 ఎకరాల భూమి సంపాదించినట్లు బయటపెట్టారు. అయితే హైదరాబాద్ తర్వాత వరంగల్ పై గత ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయాన్ని గమనించిన బాలకృష్ణ తన ఆస్తులను వరం గల్ హైవే పక్కనే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. యాదాద్రి, జనగాంలో భారీగా వ్యవసాయ భూముల కొనుగోలు చేశాడని, అందంతా బినా మీల పేరిట ఉందని దర్యాప్తులో తేలింది. అదే విధంగా అతని కుటుంబసభ్యుల పేరిట మొత్తం 15 బ్యాంకు ఖాతాలున్నట్లు ఎసిబి గుర్తించింది. ఆయా ఖాతాల పేరిట ఉన్న లాకర్లను తెరిచేందుకు ప్రయత్నించింది. శివబాలకృష్ణ పేరిట ఉన్న ఒక్క లాకర్‌ను తెరవగా ఒక పట్టాదారు పాస్ పుస్తకంతోపాటు 18 తులాల బంగారం లభ్యమైంది. వాటికి లెక్కలు చూపించకపోవడంతో అధికారులు వాటిని జప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News