Tuesday, March 18, 2025

సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఎసిబి కోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఎసిబి కోర్టు అనుమతించింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్‌లకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన పర్యటనకు అనుమతించాలని కోరుతూ ఎసిబి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయన పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేసు నేపథ్యంలో ఆయన తన పాస్ పోర్టును ఎసిబి కోర్టుకు అప్పగించారు. విదేశీ పర్యటనల నేపథ్యంలో తన పాస్ పోర్టును ఆరు నెలల పాటు తనకు అప్పగించాలని కోర్టును కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు జులై 6వ తేదీ లోగా పాస్ పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News