Wednesday, January 8, 2025

ఎసిబి ఆఫీసు వద్ద హైడ్రామా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఎసిబి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఎసిబి తాజాగా జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఎసిబి అధికారులు సోమవారం సాయంత్రం గచ్చిబౌలిలో కెటీఆర్ నివాసానికి స్వయంగా వెళ్లి నోటీసులు అందజేసారు. తమ విచారణలో లీగల్ టీంకు అనుమతి లేదని తాజాగా ఇచ్చిన నోటీసుల్లో కూడా పేర్కొనడం విశేషం. కాగా, ఇదే కేసులో 6 వ తేదిన విచారణకు హాజరు కావాలని గతంలో కెటిఆర్‌కు ఎసిబి ఇచ్చిన నోటీసు ఇవ్వడంతో ఆయన సోమవారం ఉదయం ఎసిబి కార్యాలయానికి వెళ్లారు. అయితే, ఆయన వెంట న్యాయవాదిని తీసుకెళ్లడంతో కార్యాలయంలోకి ఎసిబి అధికారులు అనుమతించలేదు. దీంతో కెటీఆర్ ఎసిబి కార్యాలయం ఎదుట బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

న్యాయవాదిని అనుమతించకపోవడం, కెటీఆర్ బైఠాయించడంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. న్యాయవాదిని అనుమతించమని తనకు రాతపూ ర్వకంగా రాసి ఇవ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. విచారణలో తనతో పాటు న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని సంబంధిత ఎసిబి అధికారికి కెటిఆర్ లేఖ అందజేసారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను విని యోగించు కోవచ్చునని, న్యాయవాదిని అనుమతించకపోవడం పట్ల కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను ఎసిబి అడుగు తున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉందని కెటీఆర్ అన్నారు. తన వాదనను ఇప్పటికే హైకోర్టుకు తెలియజేయగా, తీర్పును రిజర్వు చేసిందని గుర్తు చేసారు. కోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఎసిబి విచారణకు వచ్చానని తెలిపారు. న్యాయవాదిని వెంట తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా తనన్న హక్కు అన్నారు. .విచారణకు సహకరిస్తున్నా& ఇంతమంది పోలీసులెందుకు? అని ప్రశ్నించారు.

న్యాయవాదిని అనుమతించకపోవడం ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని కెటీఆర్ విమర్శించారు.
ఈ కేసు వల్ల రేవంత్ రెడ్డి సాధించేది ఏం లేదన్నారు. అయితే తనను ఎసిబి ఆఫీసులో కూర్చోబెట్టి తన ఇంటికి పోలీసులను పంపించి తనిఖీలు పేరుతో వేధింపులకు గురిచేయాలని చూస్తున్నారని కెటీఆర్ ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే తన విష యంలో చేయాలని రేవంత్ సర్కార్ చూస్తోందన్నారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇచ్చే పేపర్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లి తన ఇంటికి వెళ్లి ఏదో చోట పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

లీగల్ టీంతో కెటిఆర్ భేటీ
అంతకుముందు విచారణకు వెళ్లడానికి ముందు కెటీఆర్ ఉదయం నందినగర్‌లో తమ నివాసంలో లీగల్ టీమ్‌తో సమావేశమయ్యారు. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఎసిబి ప్రశ్నలపై ఎలా స్పందించాలి, చెప్పాల్సిన సమాధానాలపై లాయర్లతో ఆయన చర్చించారు. భేటీ తర్వాత కెటిఆర్ నేరుగా ఎసిబి ఆఫీసుకు వెళ్లారు.
౦౦౦౦

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News