Thursday, December 5, 2024

ఎసిబి వలలో తూనికలు, కొలతల ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్

- Advertisement -
- Advertisement -

పది వేల రూపాయల లంచం తీసుకుంటు తూనికలు, కొలతల జిల్లా ఇన్‌స్పెక్టర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. కొత్తూరు నాట్కో ఫార్మాకు చెందిన 25 ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్‌ల స్టాంపింగ్ కోసం జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ సింగబోయిన ఉమారాణి పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు గిరిధర్ రావు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. జిల్లా తూనికలు, కొలతల శాఖ కార్యాలయంలో గురువారం పది వేల రూపాయల లంచం డబ్బులను సీనియర్ అసిస్టెంట్ మల్లేష్‌కు అందచేస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వారిద్దర్నీ నాంపల్లి ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News