Wednesday, January 22, 2025

చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఎసిబి రైడ్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం తీసుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా గురువారం పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో మల్లేషం కానిస్టేబుల్‌గా, ప్రసాబ్‌బాబు హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఎం. నరేందర్ గతంలో కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ఫిర్యాదుదారుడు అంగె వెంకటరమణపై 2022లో చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. దీనిని గమనించిన ముగ్గురు కానిస్టేబుళ్లు వెంకటరమణకు ఫోన్ చేశారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ మనుషులు రామకృష్ణ, ఎవిఎన్‌ఎసి కుమార్ అచ్యూత్నా అలియాస్ చైతన్య, రాఘవేంద్ర గుప్తాను బాధితుడి వద్దకు పంపించారు. రూ.5లక్షలు ఇవ్వాలని లేకుండా అరెస్టు చేస్తారని బెదిరించారు. వెంటనే బాధితుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.3లక్షలను మల్లేషం,

ప్రసాద్‌బాబు, రామకృష్ణ, అచ్యుత్న కుమార్, రాఘవేంద్ర బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత మిగతా రూ.2లక్షలు ఇవ్వాలని బాధితుడిని వేధించడం ప్రారంభించారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు డబ్బులు తీసుకుని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు రాగా వాటిని తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడెహ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి ఎసిబి కోర్టులో హాజరుపర్చారు.చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లతో పాటు కోర్టు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసు విషయంలో కానిస్టేబుల్ నిందితుని దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు డబ్బులు ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అర్ధరాత్రి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో అధికారులు సోదాలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News