Friday, November 22, 2024

ఎసిబి చేతికి చిక్కిన మరో అవినీతి తిమింగలం

- Advertisement -
- Advertisement -

ఎసిబి అధికారుల చేతికి మరో అవినీతి తిమింగలం చిక్కింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఎసిబి ప్రత్యేక విభాగం అధికారులు హనుమకొండ కెఎల్‌ఎస్ రెడ్డి కాలనీలోని ఆమె నివాసంలో బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. రజనీ నివాసంతో పాటు హనుమకొండ కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆమె బంధువుల నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాలలో ఎసిబి అధికారులు భారీ మొత్తంలో భూములకు సంబంధించిన విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎసిబి అధికారులు రూ.55,22,630ల విలువైన ఏడు ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్, రూ.21,17,700ల విలువైన 22 ఓపెన్ ప్లాట్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

రజనీ, ఆమె కుటుంబసభ్యుల పేరిట కొనుగోలు చేసిన రూ.50 లక్షల విలువ చేసే భూమి డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వీటి మార్కెట్ విలువ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎసిబి అధికారులు వెల్లడించారు. ఈ సోదాలలో నగదు రూ.1,51,540, రూ.25,73,525 బ్యాంకు బ్యాలెన్స్, రూ.10,27,783 విలువ చేసే 1462.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.9,39,100 విలువ చేసే గృహోపకరణాలు, రూ.31,06,000 విలువ చేసే వెహికల్స్‌ను గుర్తించారు. కాగా, మొత్తం ఆస్తుల విలువ రూ.3,20,16,195లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే మొత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 12 కోట్లు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎసిబి అధికారులు రెండు బృందాలుగా రెండు బృందాలుగా విడిపోయి బుధవారం ఉదయం జమ్మికుంటలోని రజనీ నివాసానికి, హనుమకొండ లోని ఆమె బంధువుల ఇంటికి ఏకకాలంలో చేరుకున్నారు.

ఓ బాధితుల ఫిర్యాదు మేరకే ఎసిబి అధికారులు తాహసీల్దార్ ఇంట్లో దాడులు చేశారు. భూములకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రజనీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. రజనీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News