- Advertisement -
హైదరాబాద్: ట్రాన్స్‌పోర్ట్ డిటిసి పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఎసిబి దాడులు చేసింది. హైదరాబాద్, వరంగల్తో పాటు 8 చోట్ల ఎసిబి అధికారుల తనిఖీలు చేపట్టారు. డిటిసి శ్రీనివాస్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో ఎసిబి అదికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని శ్రీనివాస్ బందువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడ పెట్టాడని డిటిసి శ్రీనివాస్పై ఆరోపణలు ఉన్నాయి. రూ. 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.
- Advertisement -