Monday, January 27, 2025

ఫార్ములా-ఈ కారు కేసులో కీలక పరిణామం..

- Advertisement -
- Advertisement -

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేసింది. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం నమోదుతో ఈ కేసులో నిందితులు కేటీఆర్, అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఫార్ములా ఈ రేసు కేసులో రూ.55 కోట్ల అవినీతికి మాజీ మంత్రి కెటిఆర్ పాల్పడినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కెటిఆర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ఇటీవల గవర్నర్ అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కెటిఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. వారం రోజులపాటు ఆయనను అరెస్టు చేయొద్దని అధికారులను ఆదేేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News