Monday, January 20, 2025

ఫార్ములా ఈకార్ రేసింగ్ కేసు ఎ1 కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఈకార్ రేసులో ప్రభుత్వ నిధుల
దుర్వినియోగంపై ఎసిబి కేసు
నమోదు నాలుగు నాన్
బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు
రేసు నిర్వహించిన కంపెనీకి
కేబినెట్, ఆర్థికశాఖ, ఆర్‌బిఐ
అనుమతులు లేకుండా రూ.55కోట్లు
చెల్లించినట్లు అభియోగం విదేశీ
సంస్థకు నగదు చెల్లింపుపై
విచారణ చేయనున్న ఎసిబి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ— కార్ ఫార్మూలా రేస్ వ్యవహారంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందన్న అ భియోగం పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై అవినీతి నిరోధకశాఖ గు రువారం కేసు నమోదు చేసింది. నాలుగు సెక్షన్ల కింద నమోదు చేసిన ఈ కేసులో ఎ1గా కెటిఆర్, ఎ2గా అ ప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎ-3గా హెచ్‌ఎండిఎ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్నది. ఈ ముగ్గురిపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏసీబీ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సెక్షన్ 176 బిఎన్‌ఎస్‌ఎస్ కింద 13(1)ఎ, 13(2) పిసి యాక్ట్, అలాగే 409, 120బి సెక్షన్ల కిందమొత్తం నాలుగు కేసులు నమోదు చేయగా, ఈ సెక్షన్లు అన్ని నాన్ బెయిలబుల్‌గా పేర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఖప్తి మేరకు మాజీ మంత్రి కెటిఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతించడం, అనుమతి లభించగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అవినీతి నిరోధక శాఖకు లేఖ రాయడం, వారు వెంటనే రంగంలోకి దిగి కేసులు నమోదు చేయడం చకచకా జరిగాయి. కాగా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంతో మంత్రివర్గం అనుమతి, ఆర్థికశాఖ ఆమోదం లేకుండా, రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ -ఫార్మూలా కార్ రేస్ నిర్వహించిన (ఎఫ్‌ఈవో) కంపెనీకి రూ.55 కోట్లు హెచ్‌ఎండిఎ చెల్లించిందని అభియోగం మోపుతూ ఎసిబి కేసు నమోదు చేసింది. అప్పుడు మున్సిపల్‌శాఖ మంత్రిగాఉన్న కెటిఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపగా, ఇదే అంశంలో ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని అనుమతి లేకుండా చెల్లించడం పట్ల అప్పటి ప్రభుత్వానికి ఆర్‌బిఐ రూ.8 కోట్ల జరిమానా విధించింది. మంత్రిమండలి అనుమతి లేకుండా కేటీఆర్ సొంత నిర్ణయం తీసుకోవడంలో కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు న నమోదు చేసింది.

మరోవైపు ఈకేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఏసీబీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ కేసులో పూర్తిస్థాయివిచారణ జరిపిన అనంతరం ఏసీబీ అధికారులు తదుపరి చర్యకు దిగే అవకాశమున్నట్టు సమాచారం. రేసింగ్ వ్యవహారంలో పూర్తి బాధ్యత నాదేనంటూ గతంలో కెటిఆర్ వ్యాఖ్య ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో పూర్తి బాధ్యత తనదేనంటూ గతంలోనే కెటిఆర్ వ్యాఖ్యానించారు. అలాగే నిధులు విడుదల చేయ డాని కి మంత్రివర్గం ఆమోదం అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేస్తే చేసుకోమనండి అని కెటిఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News