Thursday, January 23, 2025

అంబర్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి సోదాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః భూమి విషయంలో లంచం తీసుకుంటు రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం పట్టుబడ్డారు. సర్వేయర్ పరారీలో ఉండగా, స్పెషల్ రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ శోభ, డ్రైవర్ బాపు యాదవ్‌ను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. అంబర్‌పేటకు చెందిన దడువాయి వెంకటేశ్వరరావు తన తల్లి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని అంబర్‌పేట రెవెన్యూ అధికారులను సంప్రదించాడు.

భూమి విలువ రూ.80లక్షలు ఉంది. దీని వల్ల రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువ కావడంతో భూమి విలువను రూ.60లక్షలకు తగ్గించాలని కోరాడు. దానికి సర్వేయర్ డి. లలిత, స్పెషల్ రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ పి.శోభ రూ.10లక్షలు డిమాండ్ చేశారు. సర్వే చేసిన రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ విలువ తగ్గిస్తామని చెప్పారు. దానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు డబ్బులు బాధితుడికి ఇచ్చి పంపించారు. రెవెన్యూ అధికారుల సూచనల మేరకు కారు డ్రైవర్ బాపు యాదవ్‌కు రూ.1,50,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి దాడులు తెలుసుకున్న సర్వేయర్ లలిత పరారయ్యారు. డ్రైవర్ బాపు యాదవ్, శోభను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News