Wednesday, January 8, 2025

ఫార్ములా ఈ కేసు.. గ్రీన్ కో కార్యాలయంలో ఎసిబి సోదాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్‌లోని గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ మంగళవారం ఉదయం సోదాలు నిర్వహిస్తోంది. గ్రీన్ కో తోపాటు అనుబంధ సంస్థ ‘ఏస్‌ నెక్ట్స్‌జెన్‌’లోనూ సోదాలు చేస్తున్నారు. గ్రీన్‌కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు.. రూ.41 కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇక, ఏపీ, పచిలీపట్నంలోని కార్యాలయానికి ముగ్గురు తెలంగాణ ఎసిబి అధికారులు వెళ్లినట్లు సమాచారం. కాగా, ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ లో గ్రీన్ కో కూడా భాగస్వామ్యం కావడంతో.. ఆ సంస్థ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News