Monday, January 20, 2025

ఎసిబి వలలో అవినీతి తిమింగలం

- Advertisement -
- Advertisement -

మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో ఎసిబి దాడులు
రూ. 4.56 కోట్ల విలువైన నగదు స్వాధీనం
అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన అధికారులు

మన తెలంగాణ/ హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు భారీ తిమింగలం పడింది. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే మొదటిసారి. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించారు. శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు వనస్థలిపురం హస్తినాపురం షీర్డిసాయినగర్ నగర్‌లో ఉంటున్న మహేందర్రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర చర, స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నారు.

ట్రంక్ పెట్టెలో భారీగా దాచి పెట్టిన నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ ట్రంక్ పెట్టెను వెల్డర్ సాయంతో తెరిచారు. కౌంటింగ్ మిషన్ సాయంతో నగదు లెక్కించగా రూ.2 కోట్లుగా తేలింది. గతంలో కందుకూరులోనూ తహసీల్దార్ గా పని చేసిన మహేందర్ రెడ్డిపై అవినీతి నిరోదక శాఖకు ఫిర్యాదులు రావడంతో దృష్టి పెట్టారు. ఆయన ఇంట్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. మహేందర్రెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లతో పాటు 15 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మహేందర్రెడ్డి విధులు నిర్వహిస్తున్న మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంలోనూ అధికారులు సోదాలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News