Saturday, September 14, 2024

ఎసిబికి చిక్కిన మరో అవినీతి చేప

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మరో అవినీతి చేప ఎసిబి అధికారులకు చిక్కింది. జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బొమ్మల శ్రీనివాస రాజు గురువారం కలెక్టరేట్ ఆవరణలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఎసిబి హైదరాబాద్ సిటీ రేంజ్-2 యూనిట్ డిఎస్పి శ్రీధర్ వివరాలను వెల్లడించారు. ఫిర్యాదు దారునికి నవభారత్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్ వారికి మధ్య ఉన్న వివాదంపై దాఖలైన కేసులో జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బొమ్మల శ్రీనివాస రాజు విచారణ అధికారిగా ఉన్నారు. ఈ కేసులో ఫిర్యాదు దారునికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను శ్రీనివాస రాజు రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.లక్ష లంచంగా ఇచ్చేందుకు అంగీకరించిన ఫిర్యాదు దారుడు ఈ విషయాన్ని ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. గురువారం మధ్యాహ్నం రూ.లక్ష నగదు తీసుకొని

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ బొమ్మల శ్రీనివాస రాజు వద్దకు వెళ్ళాడు. ఇటీవల ఎసిబి దాడులు పెరిగాయని చెప్పి నేరుగా లంచం డబ్బులు తీసుకునేందుకు నిరాకరించిన ఆయన కలెక్టరేట్ గ్రౌండ్ లో పార్కు చేసిన తన కారులో డబ్బు ఉంచాలని సూచించాడు. కలెక్టరేట్ మొదటి అంతస్తు లో ఉండి రిమోట్ ద్వారా కారు లాక్ తెరవడంతో ఫిర్యాదు దారుడు కారు డ్రాలో డబ్బు ఉంచి కిందికి దిగగా శ్రీనివాస రాజు తిరిగి రిమోట్ తో కారు లాక్ చేశాడు. దింతో అప్పటికే అక్కడ బృందాలుగా వేచిఉన్న ఎసిబి అధికారులు శ్రీనివాస రాజును అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉంచిన రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకొని రసాయన పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస రాజును విచారణ అనంతరం ఎసిబి కేసుల ప్రత్యేక న్యా య మూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News