జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత లంచం తీసుకుంటూ సోమవారం ఏసిబి వలలో చిక్కారు. వివరాల్లోకి వెళితే… లింగాల ఘనపురం మండలానికి చెందిన చిట్టిపెల్లి రాజు జనగామ పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో నిర్మించిన భవనంలో బంకెట్ హాల్ అనుమతి కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకుగాను మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత రూ.50 వేల లంచం డిమాండ్ చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని రాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో సోమవారం రూ.40 వేలను కమిషనర్ డ్రైవర్‌కు ఇస్తుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసిబి డిఎస్‌పి సాంబయ్య డ్రైవర్‌ను విచారించగా కమిషర్‌కు సంబంధించినవి అని తెలపడంతో అధికారులు మున్సిపల్ కమిషనర్ రజితను విచారిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ దాడులు జరుపుతున్నా అవేమిపట్టనట్లుగా అధికారులు లంచం తీసుకుంటూ పట్టబడటం జనగామలో చర్చాంశనీయంగా మారింది. ఈ సందర్భంగా ఏసిబి డిఎస్‌పి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ రాజు నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ డ్రైవర్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడినట్లు ఆ డబ్బులు జంపాల రైతులకు చెందిన డబ్బులని తెలియచేయడంతో ఆ రైతులను విచారిస్తున్నమని, మున్సిపల్ కమిషనర్‌ను రేపు ఏసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలియచేశారు.