Thursday, January 23, 2025

సమీకృత మార్కెట్ నిర్మాణ పనులలో వేగం పెంచండి

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్ : బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా సమీకృత మార్కెట్ నిర్మాణ పనులలో వేగం పెంచాలని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నా రు. హనుమకొండలో నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను కమిషనర్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేలా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించడం జరుగుతుందని ఇప్పటివరకు 70 నిర్మాణ పనులు పూర్తికావడం జరిగిందని, మిగతా పనులు పూర్తి చేయడానికి 3-4 కోట్ల రూపాయలు అవసరం అని, ఆర్థిక పరమైన అవసరాల కోసం గతంలోనే ఫైల్‌ను ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో మరోసారి ఫైల్ ను పంపించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం 12 మోరీల జంక్షన్ వద్దకు చేరుకున్న కమిషనర్ నాలాను పరిశీలించారు.ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ బొందివాగు, కరీమాబాద్ ప్రాంతాల నుండి ప్రవాహం వస్తున్నందున ఇక్కడ ఏర్పడ్డ డిసిల్టింగును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎస్.ఈ కృష్ణారావు, ఈ.ఈ.రాజయ్య, డిఇ లు సంతోష్ బాబు, రవికుమార్, ఏ.ఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News