Monday, January 20, 2025

ఆమోదయోగ్యంగా బిజెపి మేనిఫెస్టో రూపకల్పన : ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా బిజెపి మేనిఫెస్టో రూపొందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో హుజూర్‌నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీలత రెడ్డి, వివిధ పార్టీల నాయకులు ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు. వారందరికి పార్టీ కండువాను ఈటల రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్,-బిఆర్‌ఎస్ పార్టీలు చేసిన అభివృద్ధి ఏంటో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు బిజెపికి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా బిజెపి మేనిఫెస్టో రూపొందిస్తున్నామని వెల్లడించారు. పార్టీలో చేరిన శ్రీలతారెడ్డి మాట్లాడుతూ అబుదాబిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం.ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలు నెరవేరలేదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చి.. మహిళలు రాజకీయంగా ఎదగేలా చట్టం తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదే ఆమె అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హుజుర్‌నగర్ నుంచి శ్రీలత రెడ్డి
అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్‌నగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా చల్లా శ్రీలత రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం టికెట్ ఆమోదం చేసిన తర్వాతనే ఆమె పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను కూడా ఆమె ఇప్పటికే మొదలుపెట్టినట్టు సమాచారం. చల్లా శ్రీలత రెడ్డి నేరేడుచర్ల మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలరుగా పోటీ చేసి గెలిచి నేరేడుచర్ల మున్సిపాలిటీలో వైస్‌చైర్‌పర్సన్ గా ఎన్నికయ్యారు. బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. కొన్ని రోజులు ఆ పార్టీకి దూరంగా ఉంటూ ఈ నెల 4న బిఆర్‌ఎస్‌కు, వైస్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News