Monday, December 23, 2024

కులవృత్తులకు లక్ష రుపాయల ఆర్థిక సాయానికి దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: కులవృత్తులకు చేతివృత్తిదారులకు 1లక్ష రుపాయల ఆర్థిక సాయం కోసం ఈ నె 20 వరకు ఆన్‌లైన్‌లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధ్ది అధికారి జగదీష్ అన్నారు.ఈ పథకానికి నాయి బ్రాహ్మణులు, రజకులు, నగర, ఉప్పరి, కుమ్మరి శాలివాహన, అవుసలి, కంసాలి, కమ్మరి, కంచర, వడ్ల, వడ్ర, వడ్రంగి, శిల్పి క్రిష్ణబలిజ పూసల, మెదర, వడ్డెర, ఆరేకటిక మేర దర్జీ, ఎంబిసి కులాల అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాలలోపు ఉండాలని కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు కలిగిఉండాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000, పట్టణ ప్రజలకు 2 లక్షలకు లోపు ఉండాలన్నారు.

ఏప్రిల్ 2011 తర్వాత తీసిన ఆదాయ ధృవపత్రంతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కులవృత్తిలో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు తేదీ నుంచి గత 5 సంవత్సరాలలోపు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థిక లబ్ధి పొందిన 201/18లో 50వేల లబ్ధ్దిపొందిన అనర్హులన్నారు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన వారు ఈ పథకానికి దరఖాస్థులు చేసుకోవాలని తెలిపారు. కుల ,ఆదాయ ధృవీకరణ ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట సైజ్ ఫొటో, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలతో ఆన్‌లైన్‌లో ఈ నెల 20లోగా దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News