Wednesday, January 22, 2025

ఫారెస్ట్రీ పిజి కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సిఆర్‌ఐ)లో ఈ విద్యా సంవత్సరం ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఐకార్ ఎఐఈఈఎ పిజి ప్రవేశ పరీక్షలో 50 శాతం, బిఎస్‌సి (అనర్స్), ఫారెస్ట్రీకి 50 శాతం వెయిటేజీ అకాడమిక్ స్కోర్ ఇవ్వనున్నారు.

దరఖాస్తులను కళాశాల వెబ్ సైట్ www.fcrits.inలో పొందాలని, ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు రుసుం ఆన్‌లైన్‌లో చెల్లించాలని, ఎస్‌సి,ఎస్‌టి, దివ్యాంగులకు రూ. 1000, ఇతరులకు రూ రూ.2 వేలు చెల్లించాలని కోరారు. రూ.500 అలస్య రుసుంతో ఈ నెల 28-వ తేదీ వరకు చెల్లించే వీలుంది. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 80743 50866,89194 77851 సంప్రదించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News