i2E ప్రీ -ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల స్వీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, మేక్ రూమ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో i2E ల్యాబ్ 14 వారాల ప్రీ-ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఇన్నోవేషన్ ఆఫీసర్, శాంత తౌటం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. i2E ల్యాబ్ ద్వారా ఐడియా ధ్రువీకరణ, మెంటార్‌షిప్, బిజినెస్ డెవలప్‌మెంట్, పిచ్చింగ్, మార్కెట్ యాక్సెస్, ఫండింగ్ కనెక్షన్‌కి సంబంధించిన వనరులతో మద్దతు అందిస్తామన్నారు. ప్రారంభదశ ఆలోచనలు, విద్యార్థుల ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ముందుకు తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం మొదటి దశలో ఆవిష్కర్తలకు రూ.80 లక్షల నిధులను, మార్కెట్ యాక్సెస్‌ని కల్పించాం.
రెండో ఐసిటి పాలసీ రాష్ట్రంలో వ్యాపారం, సాంకేతికత, సేవలకు ప్రాప్యత, ఆవిష్కరణలను ప్రారంభించినట్లుగా, i2E ల్యాబ్ కార్యక్రమం ఆవిష్కరణలను ఆచరణీయ వ్యాపారాలుగా మార్చే వీలుంది. ప్రారంభ దశ ఆలోచనలను పెంపొందించడానికి, ప్రపంచ స్థాయి పాఠ్యాంశాలు, మార్గదర్శకులు, నిధుల ప్రాప్యత, ప్రోటోటైపింగ్ సౌకర్యాలు, సమిష్టి అవసరాలకు తగినట్లుగా ప్రయోగాత్మక పరిష్కారాలకు ఒక వేదికను అందిస్తుంది. కొత్త ఐసిటి పాలసీలా అన్ని ప్రాంతాలు- టైర్ 2, 3 అంతకు మించి,ఆవిష్కర్తలను ప్రోత్సాహించడం మా నిబద్ధత అని మేక్ రూమ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రణవ్ హెబ్బర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దరకాస్తులను https://teamtsic.telangana.gov.in/i2elab లింక్ ద్వారా చేసుకోవచ్చుని తెలిపారు.