Thursday, January 23, 2025

రిఫ్రిజిరేటర్ ఏసి సర్వీసింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: రిఫ్రిజిరేటర్ ఏసి రిపేరింగ్‌లో ఉచిత శిక్షణకు పురుషుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బిఆర్‌ఎస్‌ఈటీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. 19 నుడి 45ఏళ్లలోపు వయస్సు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని పురుషులకు రిఫ్రిజిరేటర్, ఏసి రిపేరింగ్, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందన్నారు. 24 నుంచి నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యంతో యూనిఫారం, టూల్ కిట్ ఇస్తారన్నారు. అభ్యర్థులకు చదవడం రాయడం రవాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నాలుగు పాస్‌పోర్టు సౌజ్ ఫొటోలతో సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో స్టేట్ బ్యాంక్ శిక్షణ కేంద్రంలో 22వ తేదీలోపు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను సెల్ ఫోన్ నెంబర్ 9704446956,9490129839కు వాట్సాప్ చేయాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News