Friday, November 22, 2024

సబ్సిడీ రుణాలకు త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

Acceptance of applications for subsidized loans soon

50 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రెండో దశలో 95 కోట్ల రుణాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : నిరుద్యోగ మైనారిటీ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సబ్సిడి రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో విధి విధానాలు ఖరారు కానున్నాయి. వెను వెంటనే దరఖాస్తులను స్వీకరించడానికి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో 5 వేల మందికి రుణాలు ఇవ్వాలని మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి 50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మొదటి విడతలో రెండు లక్షల లోపు రుణాలు ఇవ్వనున్నారు. మొదటి యునిట్ లక్ష లోపు రుణాలకు 80 శాతం, రెండో యునిట్ లక్ష నుండి రెండు లక్షల లోపు రుణాలకు 70 శాతం సబ్సిడి ఇవ్వనున్నారు. ఇందు కోసం త్వరోలోనే ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. తొలి విడతలో 5 వేల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ఱయింగా అందులో 3500 మందికి లక్ష లోపు రుణాలు, 1500 మందికి లక్షల నుండి రెండు లక్షల లోపు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.

తొలిబిదత ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెలాఖరు వారకు గడవు ఇచ్చే అవకాశం ఉంది. తొలి విడత రుణాలు పూర్తయిన తర్వాత రెండో విడతలో 95 కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు మైనరిటి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాఖ్ తెలిపారు. రెండో విడతలో పది లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కగా మైపారిటి నిరుద్యోగలకు వివిధ కారణాల వల్ల గత ఆరేళ్ళుగా సబ్సిడి రుణాలు మంజూరు కాలేదు. దీంతో చాలా మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 15 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడి ఫైనాన్స్ కార్పొరేషన్‌కు దాదాపు 1.53 లక్షకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో అప్పట్లోనే 100 శాతం సబ్సిడికి సంబంధించి 1585 దరఖాస్తులను పరిష్కరించారు. లక్ష నుండి 2 లక్షల రుణాలకోసం వచ్చిన దరఖాస్తుల్లో 23 వేల దరఖాస్తులను కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. అయితే వారికి నిధులు విడుదల చేయలేదు.

మిగితా లక్షా పాతిక వేలకు పైగా దరఖాస్తులు ఆనాటి నుండి పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత సబ్సిడి రుణాల కోసం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించలేదు. స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాల కోసం మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడి రుణాలు అందజేస్తోంది. లక్ష నుండి 2 లక్షల రుణాలకు సంబంధించిన యునిట్‌కు 80 శాతం సబ్సిడి, 3 నుండి 5 లక్షల యునిట్‌లకు 60 శాతం సబ్సిడి, 5 నుండి 10 లక్షల రుణాలకు సంబంధించిన యూనిట్లకు 50 శాతం సబ్సిడి ఇస్తున్నారు. సబ్సిడి రుణాలు మంజూరు చేయాలని మైనారిటి వర్గాల నుండి ప్రతి ఏడాది వత్తిడి వస్తూనే ఉంది. అయితే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటిని రద్దు చేస్తూ కార్పొరేషన్ అధికారులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

మళ్ళి కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 10 వేల మందికి సబ్సిడి రుణాలు మంజూరు చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. ఆరేళ్ళ నుండి సబ్సిడి రుణాలు ఇవ్వక పోవడం, గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్డతినడం వల్ల చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2014-15 లో లక్షా 50 వేలకు పైగా దరఖాస్తులు రాగా ఈ సారి అంతకు మించి దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News