Wednesday, January 22, 2025

కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో అకౌంటెంట్ ఎఎన్‌ఎం పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీలుగా ఉన్న అకౌంటెంట్, ఎఎన్‌ఎం పోస్టుల భర్తీకి మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖఅధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్, కొండాపూర్‌లో అకౌంటెంట్ పోస్టులు 1చొప్పున రెండు ఉన్నాయని, మునిపల్లిలోని బాలికల వసతి గృహంలో ఒక ఎఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉందన్నారు. మహిళ అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా ప్రాజెక్టు అధికారి టిఎస్‌ఎస్ సంగారెడ్డిలోని కార్యాలయంలో ఈ నెల 24 నుండి 28 సాయంత్రం వరకు అందజేయాలన్నారు. వీరి నియామకం జిల్లా స్థాయి కమిటీ ద్వారా చేయబడుతుందన్నారు. పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు మరియు ఇతర వివరాలకు టిఎస్‌ఎస్ కార్యాలయంలో సంప్రదించాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News