Monday, December 23, 2024

ఇంటింటా ఇన్నోవేటర్ దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: ఇంటింటా ఇన్నివేటర్‌కు ఆవిష్కర్తల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సామాజిక సమస్యలకు విస్త్రృతమైన పరిష్కారాలే రూపొందించిన వారి ఆవిష్కరణలు ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రదర్శించడానికి రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటా ఉన్న ఆవిష్కర్తలు వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రోత్సహిస్తుందన్నారు. ఎంపికైన ఆవిష్కరణలు స్వాతంత్రదినోత్సవం రోజు జిల్లాలో ప్రదర్శించడానికి అవకాశం ఉందన్నారు. మన సమాజంలో లేదా చుట్టుపక్కల ఉన్న సమస్యలు విద్యాలయాల్లో వ్యవసాయ రంగానికి ఏ రంగానికి సంబంధించినదైనా వాటిని పరిష్కరించే వినూత్న ఆలోచన పరికరమే ఆవిష్కరణంగా రూపొందుతుందన్నారు.

ఏదైనా సమస్యకు కొత్త పరిష్కారం కనుకున్నా, సమస్యకు పరిష్కాకం కనుక్కునే విధానం కొత్త ఆవిష్కరణగా పేర్కొంటారని ఆదే విధంగా ఒక పరికరం చేస్తూ దానిలో ఉపయోగించే వస్తువులు పరికరాలు వినూత్నంగా ఉన్నా ఉన్నవస్తువులకు మరింత ఆలోచన జోడించి వస్తువు ఉపయోగాలు పెరిగినా ఆవిష్కరణగా పరిగణిస్తారని ఆయన ఆవిష్కరించారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు రెండు నిమిషాల వీడియోను ఆవిష్కరణ నాలుగు ఫొటోలు ఆవిష్కర్త పేరు ఫోన్ నెంబర్ వయస్సు, ప్రస్తుత వృత్తి చేస్తున్న గ్రామం జిల్లా పేరుతో సహా ఆగస్టు5వ తేదీలోగా 9100678543కి వాట్సాప్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి సెల్ నెంబర్ 9963423691లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని అన్నిరంగాలకు చెందిన వారు తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలను పెద్ద మొత్తంలో పంపి జిల్లానే ముందు స్థానంలో ంచేలా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఇంటింటి ఇన్నోవేషన్ పోస్టర్‌ను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, డిఆర్‌ఓ నగేష్‌లు ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News