Sunday, December 22, 2024

క్రిస్మస్ సందర్భంగా…. ఉత్తమ సేవలందించిన క్రైస్తవుల నుండి నామినేషన్‌ల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : క్రిస్మస్ సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన, ప్రతిభ కనబరిచిన క్రైస్తవులను తెలంగాణ ప్రభుత్వం సత్కరిస్తోంది. ముఖ్యంగా సామాజిక, విద్యా, వైద్య, సాహిత్య, కళా, క్రీడా రంగాలలో ఉత్తమ సేవలందించిన, ప్రతిభ కనబరిచిన వారికి సన్మానించనున్నారు. ఇందుకోసం తెలంగాణ క్రైస్తవ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ పై రంగాలలో 30 సంవత్సరాలకు పై బడి ఉత్తమ సేవలందించిన, ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థల నుండి నామినేషన్‌లను స్వీకరిస్తోంది.

నామినేషన్ ఫారాలు క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుండి వ్యక్తిగతంగా లేదా www.tscmfc.in వెబ్ సైట్ నుండి డైన్‌లోడ్ చేసుకోవచ్చని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన నామినేషన్‌లను సంబంధిత జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయాల్లో ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు పంపించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 04023391067 నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News