- Advertisement -
న్యూఢిల్లీ: ఒడిశా పవర్ ప్లాంట్‌లో స్టీమ్ వెలువడిన కారణంగా ప్రమాదం సంభవించినట్లు టాటా స్టీల్ మంగళవారం ప్రకటించింది. మధ్యామ్నం ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే అత్యవసర చర్యలన్నీ చేపట్టడం జరిగిందని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని టాటా స్టీల్ తెలిపింది.
ఒడిశాలోని ధెంకనల్‌లోగల టాటా స్టీల్ మేరామండలి వర్క్‌లో స్టీమ్ వెలువడిన కారణంగా బిఎఫ్‌పిపి2 పవర్ ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుందని కంపెనీ తెలిపింది. ఇన్స్‌పెక్షన్ వర్క్ జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలిపింది. గాయపడిన కొద్దిమందిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నట్లు తెలిపింది. ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేసి అన్ని అత్యవసర చర్యలను చేపట్టామని టాటా స్టీల్ తెలిపింది.
- Advertisement -