ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
లైమ్‌లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్
క్రేన్ వైర్ తెగి పడి సిఇఒ మృతి, చైర్మన్ పరిస్థితి విషమం
ఫిల్మ్‌సిటీ మేనేజ్‌మెంట్‌పై ఫిర్యాదు
కేసు నమోదు చేసిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు
మన తెలంగాణ/సిటిబ్యూరో/అబ్దుల్లాపూర్‌మెట్: రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఓ కం పెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో జరిగిన ప్ర మాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనపై కం పెనీ ప్రతినిధులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్ర కారం…విస్టెక్స్ ఏసియా కంపెనీ ఏర్పాటు చేసి 25ఏళ్లు అవుతున్న సందర్భంగా రా మోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్‌లైట్ గార్డెన్‌లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 18,19 తేదీల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగులతో కలిసి గ్రాండ్‌గా ఫంక్షన్ నిర్వహించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
ఈ కంపెనీని సంజయ్ షా స్థాపించగా ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 7.40 గంటలకు ఫిల్మ్‌సిటీలో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో క్రేన్ ద్వారా కంపెనీ సిఈఓ సంజయ్ షా (56), చైర్మన్ విశ్వనాథ్ రాజ్ డాట్ల (52)ను 20 ఫీట్ల ఎత్తు నుంచి స్టేజ్‌పైకి దించుతుండగా ఒక్కసారిగా తీగలు తెగడంతో ఇద్దరు కిందపడిపోయారు. సంజయ్ షాకు కాలు, చేయికి, విశ్వనాథ రాజు తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వారు వెంటనే వారిని మ్యాక్సీ క్యూట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున సంజయ్‌షా మృతి చెందగా విశ్వనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జానకిరామ్ రేకు కలిదిండి రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యంపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఫిల్మ్‌సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో మరికొందరు కంపెనీ ప్రతినిధులకు గాయాలైనట్లు తెలిసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.