Thursday, December 19, 2024

నిర్మాణ సంస్థలో ప్రమాదం: వలస కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

నార్సింగి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పరిధి పుప్పాలగూడలోని నిర్మాణ సంస్థలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదలో ఇద్దరు మృతి చెందారు. రెడిమిక్స్ మిక్సర్ క్లీనింగ్ చేసేందుకు ఇద్దరు యువకులు లోపలికి వెళ్లారు. ఆపరేటర్ మిషన్ ఆన్ చేయడంతో యువకులు నుజ్జునుజ్జు అయ్యారు. ఈ ప్రమాదంలో సోరేన్, సునీల్ ముర్ము అనే వలస కూలీలు మృతి చెందారు. యాజమాన్యం మృతదేహాలను రహస్యంగా ఆసుపత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న నిర్మాణ సంస్థపై మృతుల బంధువులు దాడి చేశారు. పరిశ్రమ కార్యాలయంలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News