Tuesday, April 29, 2025

రోడ్డు పక్కన ఉండగా ఢీకొట్టిన బొలేరో.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

జోగులాంబ: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న విద్యార్థినులపైకి బొలేరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందగా.. ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. కాలేజ్న నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు నర్సింగ్ విద్యార్థినులు బస్టాప్‌లో నిలబడి ఉండగా.. ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News