Wednesday, January 22, 2025

గ్రే గోల్డ్ పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మఠంపల్లి: మండల కేంద్రంలోని గ్రేగోల్డ్ సిమెంట్స్ పరిశ్రమలో పెనుప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మునగపాటి సైదులు(46),పట్టేటి సాయి(23) ,మల్లెబోయిన సైదులు కార్మికులు కెలెన్ దగ్గర పని చేస్తుండగా ఒక్కసారిగా బ్యాక్ ఫైర్ కావడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. వీరిని చికిత్స చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మునగపాటి సైదులు ఆస్పత్రిలో మరణించాడు. సాయిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. సైదులు కోదాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.గత మూడు నెలల క్రితం మరో కెలెన్ వద్ద పనిచేస్తుండగా ఇదేరీతిన ప్రమాదం జరిగిన రెడపంగు సైదులు మృతి చెందాడు.

మూడు నెలలో రెండు సంఘటనలు జరగడంతో కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పరిశ్రమ వద్దకు చేరుకుని యాజమాన్యం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.బాదిత కుటుంబాలకు న్యాయం చేస్తామని పరిశ్రమ యాజమాన్యం తెలిపారు.సీఐటియు సిమెంట్ క్లస్టర్ యూనియన్ కార్యదర్శి వట్టెపు సైదులు, మండల కన్వీనర్ సయ్యద్ రన్‌మియా,సీపీఎం మండల కార్యదర్శి మాళోతు బాలునాయక్,రాము,గోవిందు, ఆదినారాయణ, బీఆర్‌ఎస్ కేవి నియోజకవర్గ అద్యక్షులు పచ్చిపాల ఉపేందర్,బాదిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై ఇరుగు రవి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News