Thursday, December 19, 2024

హర్యానా మైనింగ్ జోన్‌లో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Accident in Haryana Mining Zone

ఇద్దరు మృతి..శిథిలాల కింద మరికొందరు

భివాని(హర్యానా): ఇక్కడి దాదమ్ మైనింగ్ జోన్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించగా అనేక మంది అందులో చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంట ప్రాంతంలో తోషమ్ బ్లాక్‌లో కొండచరియలు విరిగిపడడంతో శిథిలాల కింద దాదాపు అరడజను డంపర్ ట్రక్కులు, కొన్ని యంత్రాలు సమాధి అయినుట్ల పోలీసులు చెప్పారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు ముగ్గురిని వెలికితీయగా వీరిలో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనలో ఇఇద్దరు మరణించినట్లు భఙవానీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రఘువీర్ శాండిల్య తెలిపారు. శిథిలాల కింద మరో నలుగురైదుగురు చిక్కుకుని ఉండవచ్చని డిఎస్‌పి మనోజ్ కుమార్ తెలిపారు. అయితే ఇంత కన్నా ఎక్కువ మందే శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. దాదమ్ మైనింగ్ జోన్‌లో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై తాను జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News